హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి కేసులు నమోదు.
నేటి గదర్, ములుగు/మంగపేట, మే 20:
ములుగు జిల్లా మంగపేట మండలం లోని కమలాపురం, రాజుపేట గ్రామాలలో నడుస్తున్న దాబా హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అన్ శానిటరీ కండిషన్ లో ఉన్న పలు దాబాలపై కేసులు నమోదు చేసినట్లు ములుగు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి పి.రోహిత్ రెడ్డి తెలిపారు. మండలంలోని సాయి గణేష్, లక్ష్మీ, రేణుక, పరమేశ్వర దాబాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తనిఖీలు చేయగా వాటిల్లో అన్ శానిటరీ కండీషన్ లో ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించి వారికి ఫుడ్ సేఫ్టీ సౌండింగ్ యాక్టు 2006 ప్రకారం నోటీలు జారీ చేసినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. నోటీసుల తీసుకున్న దాబా యజమానులు మూడు రోజుల్లోగా అనుమతులు పొందడంతో పాటు అన్ శానిటరీ కండీషన్ పై నివేదికలు అందజేయాలని లేని పక్షంలో దాబాలను సీజ్ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మండలంలోని దాబాలు, హోటళ్లు, బేకరీలు టీ షాపులు ఫుడ్ సేఫ్టీ సాండెట్ యాక్టు 2006 నిబంధనల మేరకు వ్యాపారాలు చేయాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజా ఆరోగ్యం రీత్యా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు రోహిత్ రెడ్డి తెలిపారు.