నేటి గదర్, మే 20, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఆదేశాల మేరకు, గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో గిరిజన గురుకుల ఇంటర్ కళాశాలలో ప్రవేశాల కొరకు మే 23న భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల ప్రాంగణంలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం. దేవదాసు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ఇసి, ఒకేషనల్ గ్రూపులలో మిగిలిన సీట్లు భర్తీకై ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిసి, స్టడీ, కులం, ఆదాయం, ఫొటోస్, సర్టిఫికెట్లు, నాలుగు జిరాక్స్ సెట్లు తీసుకొని ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సిలింగ్ కు హాజరుకావాలని తెలిపారు. 2023- 24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థినీలకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు.
Post Views: 26