★నిరుద్యోగ యువత దళారులను నమ్మి మోసపోవద్దు : సిరిసిల్ల ఇంచార్జ్ డిఎస్పీ నాగేంద్రాచారి.
నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కు చెందిన ఓ వ్యక్తి
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్లు సిరిసిల్ల ఇంచార్జ్ డిఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ
ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట గ్రామానికి చెందిన ర్యాగటి మల్లయ్య అనే వ్యక్తి 2018 సంవత్సరంలో నర్సక్కపేట గ్రామానికి చెందిన కొత్త లింగ రెడ్డి తండ్రి శంకరయ్య, బొల్లా రాము తండ్రి దేవరెడ్డి, తిప్పారవేని చంద్రశేఖర్ తండ్రి రాజయ్య , దారం శ్రీనివాస్ రెడ్డి తండ్రి ప్రతాపరెడ్డి అనే వ్యక్తులను హుస్నాబాద్ చెందిన ( ప్రస్తుతం సిరిసిల్ల పట్టణం) కారునాథం శివకృష్ణ అనే వ్యక్తి పరిచయ చేయగా , కారునాథం శివకృష్ణ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని వారికి నమ్మబలికి వారి వద్ద నుండి 2023 సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, సింగరేణి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసి వారి వద్ద నుండి ఆరు లక్షల యాభై వేల (6,50,000/-) రూపాయలు తీసుకొని తప్పించుకొని తిరుగుతుండగా శివకృష్ణను సోమవారం రోజున ఉదయం 11:00 గంటలకు ఇల్లంతకుంట బస్టాండ్ వద్ద అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను తప్పుదోవ పట్టించి, వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదును వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. యువత కష్టపడి చదువుకొని ప్రభుత్వ నోటిఫికేషన్ల నియమావళి ప్రకారం అర్హతలు సాధించి ఉద్యోగాలు సాధించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ,అలాంటి వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుపుతున్నారు .