మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధం…
తాగునీటి సరఫరా ఆగితే ప్రజలకు కష్టాలేనా..?
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి…
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 22:
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మిషన్ భగీరథ రథం గుట్ట దగ్గర పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్ ఉండడంతో కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం వేతనాలు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ గత పది సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని వారికి సకాలంలో వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరాను ఆపేస్తూ సమ్మె నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో కార్మికులందరిని ఐక్యత పర్చి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిఐటియు నాయకులు పాయం నాగరాజు,సతీష్,ప్రభాకర్,
విష్ణు,సైదులు తదితరులు పాల్గొన్నారు.