నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.
*రైతులను మోసగిస్తే పిడి యాక్టు కేసు నమోదు చేస్తాం ఎస్ఐ రాజేందర్*
నేటి గద్దర్ కరకగూడెం : మండల పరిధిలోని ఫర్టిలైజర్ షాప్ డీలర్స్ తో కరకగూడెం ఎస్ఐ రాజేందర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అయన ఫర్టిలైజర్ యజమానులతో మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, పురుగు మందులు ఎరువులు అమ్మితే ఎంతటి వారినైన ఉపేక్షించేదిలెదని అన్నారు రైతులకు విత్తనాలు, పురుగు మందులు ఇచ్చినప్పుడు తప్పని సరిగా రసీదులు ఇవ్వాలని తెలిపారు.అనమతులు లేని కంపెనీల నుంచి గాని, అథరైజ్డ్ లేని కంపెనీ విత్తనాలు,ఎరువులు, క్రిమి సంహారక మందులు అమ్మడం గాని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుతుందని వారిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.మండల అగ్రికల్చర్ అధికారులతో తో సర్టిఫై అయిన బిల్ బుక్స్ మాత్రమే ఉపయోగించాలని నిబంధనలు పాటించకపోతె కఠిన చెర్యలు ఉంటాయని తెలిపారు.ఈ సమావేశంలో మండల పురుగుమందుల, విత్తనాల యజమానులు పాల్గొన్నారు.
