★ఈ విద్యాసంవత్సరంలో అయిన గుర్తింపు లేని ప్రవేటు పాఠశాలలపై చర్యలు ఉండేనా.
★గుర్తింపు లేనటువంటి ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలి
★పేద ప్రజలందరూ ప్రైవేట్ స్కూళ్లకు బానిసలు అవుతున్నారు
నేటి గద్దర్ కరకగూడెం:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గుర్తింపు లేనటువంటి ప్రైవేటు పాఠశాల పైన ఈ విద్యాసంవత్సరంలో అయిన అధికారులు చర్యలు ఉండెనా అని నేతకని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి దుర్గం.ప్రేమ్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా అయన విలేకర్లతో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కనీసం ఎలాంటి సౌకర్యాలు లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా పాఠశాలలు నడుపుతూ ధనార్జనయ ధీయంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నటువంటి ప్రైవేట్ పాఠశాల పైన ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలలకు కనీస సౌకర్యాలు లేవని అన్నారు. కనీసం పాఠశాల చుట్టూ అగ్నిమాపక యంత్రం తిరగడానికి స్థలం లేదన్నారు అదేవిధంగా పాఠశాలకు ఆడతలం లేదు జీవో నెంబర్ ఎంఎస్1 ప్రకారం ఏ ఒక్క పాఠశాల నియమ నిబంధనలు పాటించడం లేదని అన్నారు.ఇలాంటి పాఠశాల పైన ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి పాఠశాలలను అన్నారు.అదేవిధంగా పుస్తకాలు మరియు టై బెల్టు అమ్మినట్లయితే అట్టి పాఠశాలల యొక్క గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమాలను నియమ నిబంధనలు ఇచ్చిందన్నారు. పాటించిన పక్షంలో మా నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అట్టి పాఠశాలల గుర్తింపు రద్దు అయ్యే వరకు కార్యక్రమం చేపడతామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్, జనగం సాంబశివరావు, రాజం రాకేష్, ధర్మయ్య, మరియు జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
