ఉపాధి హామీలో రెక్కల కష్టం మాయం..?
శ్రమ ఒకడిది … సోక్కొక్కడిదా…
ఉపాధి హామీ వేతనాలను రికవరీ చేయాలని ఎంపీడీవోకి వినతి
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (చర్ల మే 28):
చర్ల మండల పరిధిలోని గొంపల్లి గ్రామ ప్రజలు గత మూడు నెలల పాటు ఉపాధి హామీ పనులు చేస్తే వారి అకౌంట్లో డబ్బులు పడకుండా ఉపాధి హామీ పనులు చేయనటువంటి వారి వ్యక్తుల ఖాతాల్లో సొమ్మును ఎలా జమ చేస్తారని,ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో అవకతవకలు జరిపిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ సొమ్మును మాకు రికవరి చేసి ఇప్పించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ చర్ల పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పని కార్మికులు చర్ల ఎంపీడీవో కనపర్తి ఈదయ్య కి మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ,ఉపాధి హామీ పని వేతనం చెల్లింపులో అవకతవకలు జరిపిన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు చెప్పట్టాలని కార్మికుల కష్టాన్ని కార్మికులు నోచుకోకుండా సుమారుగా మూడు లక్షల రూపాయల సొమ్మును పక్కదారి పట్టించి కార్మికుల పొట్ట మీద కొట్టిన దుర్మార్గులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలని వారు కష్టపడ్డ సొమ్మును వారికి రికవరీ చేసి ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను మోసం చేసి వారి కష్టాన్ని అదునుగా చేసుకొని వారికి రావలసిన సొమ్మును వారికి రాకుండా కాజేసిన దుర్మార్గులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల వేతనాలను తక్షణమే రికవరీ చేయాలని అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం ఎంపీడీవో ఈదయ్య మాట్లాడుతూ, కార్మికుల కష్టాన్ని తప్పుదోవ పట్టించిన దుర్మార్గులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.ఉపాధి కూలీల సొమ్ముని రికవరీ చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ మండల నాయకులు చెన్నం మోహన్ ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.