★నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహణ
★వర్షకాలం వరద ముప్పును ఎదురుకోవడానికి ముందస్తు ఏర్పాట్ల పై చర్చ
★కల్తీ విత్తనాలను అరికట్టాలి – ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు
★పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలి
★నేర పరిశోధనలలో సీసీటీవీ ల పాత్ర కీలకం – అన్ని ప్రధాన కూడల్ల వద్ద అమర్చండి.
★ భాధిత వ్యక్తులకు న్యాయం జరగాలి
★ రహదారుల వెంబడి ఇసుక లారీ లు అనధికార పార్కింగ్ చేస్తే కేసులు నమోదు చేయండి
★పంట పొలాలు అడవులలో విద్యుత్ తీగలు అమర్చేవారిని బైండ్ ఓవర్ చేయండి
నేటి గదర్ న్యూస్, , ములుగు ప్రతినిధి(మే 28):
ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐపిఎస్ జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమావేశం ను మంగళవారం నిర్వహించారు.
పోలీస్ స్టేషన్ల వారీగా ఆయా పోలీస్ స్టేషన్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్పీ పరిశీలించి దానికి గల కారణాలను కులంకుషంగా చర్చించి మార్గదర్శకాలను జారీ చేశారు.
రానున్న వర్షాకాలంలో ములుగు జిల్లాకు వరద ముప్పు పొంచి ఉన్నందున గత అనుభవాల దృష్ట్యా ప్రజల క్షేమం కోసం పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన చర్యలపై చర్చిండం జరిగింది.
నకిలీ విత్తనాలా ద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టడానికి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటుచేసి నిరంతరం గమనించడం జరుగుతున్నదని బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్ పి అదేశించారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా సీసీ కెమెరాల అమరికా పై చర్చించారు. ప్రజలు గ్రామ పెద్దల సహకారంతో ఆయా మండలాల అన్ని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని నేర పరిశోధన నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకం అని తెలియజేశారు.అనంతరం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల పంట పొలాలలో అడవులలో అక్రమంగా విద్యుత్ తీగలు అమరుస్తున్న వ్యక్తుల పై కఠినంగా వ్యవహరించాలని అనుమానితులను వెంటనే బైండ్ ఓవర్ చేయవలసిందిగా అదేశించారు.
అనధికారికంగా రహదారి వెంబడి ఇసుక లారీలు నిలిపితే కేసులు నమోదు చేయండి అవసరం అనుకుంటే సీజ్ చేయాలనీ ఎస్పీ ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వారి కష్టాన్ని తీర్చగలమనే భరోసాని వారికి కల్పించాలని బాధితులకు న్యాయం చేయకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉండే అర్హత లేదని ఎస్ పి అన్నారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ , ములుగుడీఎస్పీ రవీందర్ డి.ఎస్.పి డిసిఆర్బి రాములు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ములుగు సిఐరంజిత్ కుమార్ , ఎటుర్ నాగారం సిఐ రాజు , వెంకటాపురం సి ఐ కుమార్ ములుగు ఎస్సైవెంకటేశ్వర్లు, వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు పస్రా ఎస్సై కమలాకర్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఎటుర్ నాగారం ఎస్సై కృష్ణ ప్రసాద్ , వాజేడు వెంకటేశ్వర్లు కన్నాయిగూడెం ఎస్సైసురేష్ , పేరూరు ఎస్సైరమేష్ మంగపేటఎస్సై రవికుమార్ వెంకటాపురం ఎస్సై అశోక్ పాల్గొన్నారు.