★700 లీటర్ల బెల్లం పానకం,5 లీటర్ల నాటు సారా స్వాధీనం
★ సారకాస్తున్న మహిళ ,
◆ బెల్లం, పట్టిక సమకూర్చిన మహిళపై కూడా కేసు నమో
★ సారాయి తయారీకి వినియోగించే బెల్లం, పట్టిక నమ్మిన బైండోవర్ కేసులు నమోదు చేస్తాం
నేటి గద్ధర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి(పినపాక): పినపాక మండలం దుగునపల్లి గ్రామంలో మంగళవారం గుడుంబా స్థావరాల పై ఏడూళ్ల బయ్యారం పోలీసులు, మణుగూరు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు . సంఘటనా స్థలంలో నాటు సారా కాస్తున్న మాలోత్ బుజ్జి అనే మహిళ నుండి 5 లీటర్ల నాటు సారాను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విచారించగా పోలిశెట్టి నాగమణి అనే మహిళ నుండి బెల్లం పట్టిక, సారాయి తయారీకి వినియోగించే వెళ్ళు కొనుగోలు చేసినట్లు తెలపడంతో … నాగమణి మీద సైతం కేసు నమోదు చేశారు. అక్రమంగా నాటు సారాయికి వినియోగించే బెల్లం , పట్టికను ఎవరు విక్రయించిన బైండవర్ కేసులు నమోదు చేస్తామని ఆయా శాఖల అధికారులు సీరియస్ గా హెచ్చరించారు. అనంతరం దుగినేపల్లిగ్రామంలో ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో నాటుసార త్రాగడం మూలంగా కలిగి అనారోగ్య సమస్యలను వివరించారు. నాటు సారా కాస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా శాఖల అధికారులు గుడుంబా తయారీదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం పోలీసులు, మణుగూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.