◆సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి.
◆చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్ ల నీటి నిల్వల సామర్థ్యం పై నివేదికలు సమర్పించాలి.
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 3):
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలేక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలు రెవిన్యూ శాఖ కు సంబంధించినవి (02), ఉద్యోగాలకు సంబంధించినవి (03), పెండింగ్ బిల్లులకు సంబంధించినవి (04), ఇతర శాఖలకు సంబంధించినవి (4), మొత్తం (13) దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ,ఆర్డీవో సత్యపాల్ రెడ్డి లతో కలిసి దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని చెరువ్వులు, కుంటలు, ప్రాజెక్ట్ ల మరమత్తులు నివేదికలు వాటి ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం , పూర్తి నీటి నిల్వ సామర్థ్యం తదితర వివరాలు వెంటనే నివేదిక సమర్పించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పంపిణీ చేసే బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు వచ్చే మూడు నెలలకు సరిపోయే విధంగా డీలర్లు స్టాక్ నిల్వలు సిద్ధంగా ఉంచుకోనే విధంగా చూడాలని సంబంధిత అధికారులును ఆదేశించారు. వర్షాకాలం లో సీజనల్ వ్యాధుల పై వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు అందుబాటులో ఉండాలని , మందుల కొరత లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ శ్రీనివాస్ కుమార్, డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, డి ఎం సివిల్ సప్లయి రాంపతి, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, డి ఈ ఓ పాణిని, డి సి ఓ సర్దార్ సింగ్ ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.