నేటి గదర్, జూన్ 03, భద్రాద్రి కొత్తగూడెం :
అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని భారీ స్థాయిలో పోలీసులు పట్టుకున్న సంఘటన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… మణుగూరులో అనుమానాస్పదంగా ఉన్న మినీ వ్యాలను పోలీసులు తనిఖీ చేయడం సుమారు 477 కేజీల నిషేధిత గంజాయి పోలీసులకు పట్టుబడింది. కాగా పట్టుబడిన గంజాయి డొంకరాయి నుండి అశ్వాపురం, మణుగూరు, మీదుగా జహీరాబాద్ వైపు మామిడి కాయల మాటున మినీ వ్యాన్లు వెళ్తుండగా తీసుకువెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1,19,35,000/- ఉండవచ్చునని, ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అరెస్టు అరెస్టు చేసి, మినీ వ్యాన్ తో పాటు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 358