★రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ
నేటి గద్ధర్ న్యూస్ , పినపాక :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి పది సంవత్సరాలు అయిన సందర్భంగా BRS పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పినపాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్డు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
BRS పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద, బడుగుబలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యుత్ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ రంగం అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ వనరులు కాపాడుకుంటూ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం BRS పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు అండగా ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు ముక్కు వెంకటేశ్వరెడ్డి, కొండేరు రాము, పోలిశెట్టి సత్తిబాబు, బత్తుల వెంకటరెడ్డి, షేక్ జాంగీర్, ముక్కు నాసర్ రెడ్డి, బూర సురేష్, వడియాల బుచ్చిబాబు, కంది సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.