నేటి గద్దర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ సాధించి అధికారం దక్కించుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టిడిపి శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. పలు ప్రాంతాలలో బాణాసంచా కాల్చి కేరింతలు వేస్తూ జై చంద్రబాబు జై జై టిడిపి అంటూ నినాదాలు చేశారు.
తల్లాడ పట్టణంలో టీ డి పి అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్టంలో టీ డి పి పార్టీ విజయ డంక మోగించిన విషయం తెలిసిందే… తెలంగాణలో ఆ పార్టీ ప్రస్తుతం లేనప్పటికి టీ డి పి అభిమానులు కార్యకర్తలుకు కొదవలేదు అని మరో సారి తల్లాడ ప్రజలు నిరూపించారు, అలాగే వారి అభిమానం చాటుకొంటూ బైక్ ర్యాలీ, బాణాసంచా కాల్చురు. ఈ కార్యక్రమంలో తల్లాడ పట్టణ ప్రముఖులు సరికొండ శ్రీనివాసరాజు, దీపక్ రాజు, కూచిపూడి వెంకటేశ్వరావు, పరుచూరి కృష్ణ,జినుగు వసంత్ బాబు, కోడూరి సాయి, ప్రసాద్ వెంకటగిరి పాల్గొన్నారు.