నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం:
✍️బట్టా భిక్షపతి,నేటి గద్ధర్ ప్రతినిధి
పిడుగుపాటుకు మూడు దుక్కిటెద్దులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కొత్తగూడెం పంచాయతీ పరిధి కొత్తగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు… ఎప్పటిలాగే పొలంలో మేత మేస్తున్న సమయంలో వర్షం కురిసింది. దీంతో అవన్నీ సమీపంలోని చెట్టు కిందకు చేరాయి. ఆ సమయంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన ఇర్ఫా రామారావు, మంకిడి బాబు,మంకిడి నారాయణ అనే రైతులకు చెందిన మూడు దుక్కిటెద్దులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఎంపిపి రేగా కాళిక డిమాండ్ చేశారు.
Post Views: 169