కొత్తగూడెం 2టౌన్ పోలీసులు.
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జూన్ 6:
గత 15 నెలల క్రితం అనగా ఫిబ్రవరి నెల 2023లో కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని SCB నగర్ నగర్ నందు నివాస ఉండే మనోహర్ బాబు అనే వ్యక్తి తన యొక్క ఇద్దరు పిల్లలు ఒకరు అమెరికాలో మరియు ఒకరు బెంగళూరులో ఉండడంతో వృద్ధ దంపతులు ఇంటి వద్దనే ఉన్నారు.వారి ఇంటి పై భాగంలోని పోర్షన్లో మహావీర్ అనే వ్యక్తి కుటుంబముతో సహా గత నాలుగు సంవత్సరాలుగా అద్దెకు వుంటున్నారు.వీరు అట్టి వృద్ధ దంపతులతో స్నేహంగా, సన్నిహితంగా ఉంటూ వారి ఇంటికి వేసే రెండవ తాళం యొక్క తాళపు చెవిని దొంగిలించి అదనుచూసి వారు ప్రతి రోజు గుడికి పూజకు వెళ్తారని భావించి రాత్రి పూట వారు టెంపుల్ కి వెళ్ళిన సమయంలో వారికి అనుమానం రాకుండా సదరు మహావీర్ ఆ ఇంటి యొక్క తాళం తీసి వారి ఇంటిలోని బీరువాలో ఉన్న సుమారుగా 117 గ్రాముల బంగారు ఆభరణాలైన నక్లెస్ మరియు చైను మరియు నాలుగు గాజులు దొంగిలించి వాటిని తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అయితే మనోహర్ బాబు అత్యవసరంగా పని నిమిత్తం తను తన భార్య తెల్లవారు జామునే అమెరికా వెళుతూ వారి ఇంట్లోని నగలు లేకపోవడంతో దొంగతనం జరిగిందని భావించి హాడావిడిలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోవడం జరిగింది.వాళ్లు అమెరికా వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ యొక్క మిత్రుడుకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వమని చెప్పగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఇట్టి విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సదరు మనోహర్ బాబుఅమెరికా నుంచి రాగా వారి నుంచి పూర్తి సమాచారం తెలుసుకొని దర్యాప్తు ముమ్మరం చేయగా వారి ఇంటి పైన ఉంటున్న మహావీర్ అనే వ్యక్తి ఆ ఇంటిలో దొంగతనం చేశారని అట్టి వస్తులను ఈ రోజు తను అమ్మడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు చాకచక్యంగా గోధుమ వాగు బ్రిడ్జి వద్ద పట్టుకొని అతన్ని విచారించగా దొంగతనం చేసింది తానే అని ఒప్పుకోగా అతని వద్ద నుంచి ఒక బంగారు ఆభరణాలను రికవరీ చేసి అతని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించడం జరిగింది.ఇట్టి సొమ్ము విలువ 7,60,000/-రూపాయలు ఉంటుందని సిఐ రమేష్ వివరాలను వెల్లడించారు.