◆మండల కేంద్రంలో వలసవాదులు అక్రమ కట్టడాలు కనిపించలేదా
నేటి గద్దర్ న్యూస్ హుకుంపేట మండల కేంద్రంలో కొర్లాబు కోటి బాబు అనే గిరిజనుడు చాలా కాలం నుంచి టీచర్స్ కోటర్స్ ఎదుట చిన్న షెడ్డు వేసుకుని జీవనం సాగించేవారు. ఆ షెడ్డు పాడవడంతో అదే చోట కొత్తగా నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణాన్ని అక్రమ నిర్మాణం అని స్థానిక రెవెన్యూ అధికారులు ఆ నిర్మాణాన్ని నిలిపివేసి అక్కడ ఉన్న రేకులను తాల్పానులను పట్టుకు వెళ్ళిపోయారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఆర్ఎంబి స్థలం అయినప్పటికీ తాత్కాలికంగా షాపుల నిర్మాణం చేసి అక్కడ వ్యాపారం చేసుకుని జీవన ఉపాధిని స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాలు రెవిన్యూ అధికారులు నిలిపివేయడంతో ఆ చిన్న కుటుంబం రోడ్డు పాలయ్యింది. హుకుంపేట మండల కేంద్రంలో గిరిజనేతరాలు అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఎద్దేచ్ఛగా బహుళ అంతస్తులు షాపుల నిర్మాణాలు కడుతుంటే గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసిన ఏనాడూ గిరిజనేత్రుల ఇండ్లను షాపులను కూల్చిన సందర్భాలు లేకపోయే కానీ గిరిజనులు జీవన ఉపాధి గురించి చిన్న షెడ్డు వేసుకున్న తక్షణమే తొలగిస్తారు. గిరిజన రెవిన్యూ ఉద్యోగులు గిరిజన ప్రజా ప్రతినిధులు గిరిజ నేతలకు అండగా ఉంటూ గిరిజనులకు మాత్రం అండగా ఉండలేకపోవడానికి కారణాలు ఏంటి అని స్థానిక గిరిజనులు గిరిజన సంఘాలు గిరిజన ప్రజలు ఆరోపణలు చేస్తున్నాయి.