+91 95819 05907

గుట్కా వ్యాపారం పై పోలీసు నజర్. ఐనా?

– నిషేధం తర్వాత అధిక ధరలకు గుట్కాలు అమ్మకమా..?

– నిషేధిత గుట్కాలు విక్రయిస్తే చర్యలు తప్పవు : పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్

నేటి గదర్, జూన్ 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
అలవాల వంశీ 9052354516

నిషేధిత గుట్కాలను, పొగాకు తయారిలను కొందరు ఏజెంట్లు గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారస్తులకు, వ్యాపారస్తుల ద్వారా గుట్కా ప్రియులకు అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ నింబంధనలను పలువురు వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. పాలకులు జారీ చేస్తున్న ఆదేశాలు వ్యాపారుల అక్రమాల నేర్పుతో నీరుగారి పోతున్నాయి. దోచుకోవడం పరమావధిగా కొందరు వ్యాపారులు గుట్కా ప్రియులకు టోకరా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుట్కాలు, ఇతర పొగాకు తయారీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసిన నేపథ్యంలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిషేధిత గుట్కాలను పోలీసు యంత్రాంగం చాకచక్యంగా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. పలుచోట్ల ప్రభుత్వ అధికారులు, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం గుట్కాలు, నిషేధిత పొగాకు తయారీల వినియోగం ప్రజల ఆరోగ్యలపై ఏ విధంగా దుష్ప్రభావం చూపుతుంది అని వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల తదితర ప్రాంతాలలో అధికారుల కళ్ళు గప్పి గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. గుట్కా ప్రియులను ఆసరాగా చేసుకుని కొందరు గుట్టు చప్పుడు కాకుండా గుట్కా విక్రయాలు చేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిషేధానికి ముందు ఉన్న గుట్కా రేట్ల కంటే నిషేధం తర్వాత మూడు రెట్లు అధిక రేట్లకు గుట్కాల విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు సైతం నిషేధిత గుట్కా వ్యాపారంపై నిఘాను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, గుట్కా వ్యాపారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.., కొందరు వ్యాపారస్తులు గుట్కా వ్యాపారాలను అధికారుల కళ్ళు తప్పి కొనసాగిస్తున్నట్లు సమాచారం.

– నిషేధిత గుట్కాలు విక్రయిస్తే చర్యలు తప్పవు : పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్

ఈ విషయంపై పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ నేటి గదర్ ప్రతినిధితో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గుట్కాల వినియోగంపై నిషేధం ఉందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుట్కా వ్యాపారులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఎవరైనా గుట్కాల అమ్మకాలకు, రవాణాకు, నిల్వ ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కాల, పొగాకు ఉత్పత్తుల వినియోగించడం వలన క్యాన్సర్, తదితర వ్యాధుల బారిన పడే అవకాశాలు లేకపోలేదని ఆయన తెలిపారు. యువత, ప్రజలు సైతం ప్రభుత్వ నిషేధిత పదార్థాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని డిఎస్పి అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !