వృద్ధాశ్రమంలో మేదరి పవన్ కుమార్ జన్మదిన వేడుకలు
బియ్యం మరియు పండ్లు,స్వీట్స్ పంపిణీ…
నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం/మణుగూరు జూన్ 8:
సింగరేణి ఎం ఎం సి లబ్ధిదారుల సంఘం ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా అధ్యక్షురాలు మేదరి పద్మ తన కుమారుడు పవన్ జన్మదిన వేడుకలు శనివారం మధ్యాహ్నం అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు.వృద్ధుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వృద్ధులు పవన్ కు జన్మదిన శుభాకాంక్షలుతో పాటు ఆశీస్సులు అందజేశారు. వృద్ధాశ్రమానికి 50 కిలోల బియ్యాన్ని వృద్ధులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు.స్థానిక ఓసి- 2 ,బి-రిలే డంపర్ ఆపరేటర్ జల్లా రమేష్ తన వంతు కర్తవ్యం వృద్ధాశ్రమానికి 25 కేజీల బియ్యాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా మాట్లాడుతూ,దాతల దాతృత్వాన్ని ప్రశంసించారు. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల వృద్ధులు వృద్ధాశ్రమం నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వృద్ధాశ్రమంలో 25 మంది వరకు పండుటాకులకు ఆశ్రయం కల్పించామని దాతల సహకారంతో నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగుతొందని సింగరేణి సేవా సమితి మరియు ఉద్యోగుల సహకారం మరువలేనిది అన్నారు,గతంలో సింగరేణి ఆధ్వర్యంలో వైద్యులు నెలకు ఒకసారి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసే వారని కరోనాతో నిలిచిపోయిన ఉచిత మెడికల్ క్యాంప్ పునరుద్ధరించాలని వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ షేహనాజ్ సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో ఎం ఎం సి లబ్ధిదారుల సంఘం అధ్యక్షురాలు మేదరి పద్మ, పావని సామాజిక కార్యకర్త ఏ మంగీలాల్,వెంకటేష్, వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ మెహరాజ్,భద్రం వృద్ధులు పాల్గొన్నారు.