మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలి…
వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేసుకొనే విధంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి…
మాదిగ జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపకులు: డా.పిడమర్తి రవి
నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ జూన్ 8:
నైనారపు నాగేశ్వరరావు ✍️
పాల్వంచ మండల పరిధిలోని శనివారం నాగారం గ్రామంలో జరిగిన జనసభకు మాదిగ జేఏసి జిల్లా అధ్యక్షులు గద్దల రమేష్ అధ్యక్షతన జరిగింది.మాదిగ జనసభలో ముఖ్య అధితిగా పాల్గొన్న రాష్ర్ట తొలి యస్సి కార్పొరేషన్ చైర్మన్,మాదిగ జేఏసి వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ,రాష్ట్ర జనాభా తమాషా ప్రకారం మాదిగల 12% రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్రం సర్కిలర్ జారి చేయాలని బిజేపి పార్టీని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బిజేపి ఎంపి లను తెలంగాణలో తిరగనియ్యమని హెచ్చరించారు. వెంటనే కుల,గణన చేపట్టి బిసి లకు 50%,మాదిగలకు 12%,యస్టి లకు 10%, మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం పాల్వంచలో పట్టణంలో ఉన్న డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పిడమర్తి రవి పూల మాల వేసి,ఘనంగా నివాళ్ళు అర్పించినారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసి జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు,ఒక్కలగడ్డ చంద్రశేఖర్ మాదిగ జేఏసి ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు, జున్ను రవి,మాదిగ జేఏసి జిల్లా ఉపాధ్యక్షులు,మాదిగ జేఏసీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ కుంపటి శివ,మాదిగ జేఏసి ఉపాధ్యక్షులు,కిన్నెర లక్ష్మణ్,మాదిగ జేఏసీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు వేల్పల జోషి,మాదిగ జేఏసీ నాయకులు, రవికుమార్,సాయి,వెంకటేష్, అనిల్,ప్రవీణ్ తదితరులు
పాల్గొన్నారు.