నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం:
మణుగూరు ప్రజా భవన్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ని శనివారంకరకగూడెం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
కరకగూడెం మండలం రేగళ్ల గ్రామ పంచాయతీలోని మదన్నగూడెం, చింతలగుంపు గ్రామాల రైతుల పోడు భూముల సమస్య కరెంట్ విద్యుత్ సదపాయం అందించాలని అక్కడి ప్రజలతో కలిసి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్లుప్తంగా తెలుసుకొని త్వరలో వారి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,
మాజీ సర్పంచ్ కుంజా వసంతరావు, ఉప సర్పంచ్ బడిష లక్ష్మి నారాయణ మండల నాయకులు తొలెం నారాయణ ,కార్యకర్తలు యువకులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.