+91 95819 05907

ఆరోగ్యశ్రీ లో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు…

1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు…

487 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 9:

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్,పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స,ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వము 2007 లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యము అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకం ప్రెవేశపెట్టారని అన్నారు.ఈ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నారని, వీరికి 10 లక్షల వరకు ఆర్ధిక సహాయం ఈ పధకం ద్వారా అందుతుందన్నారు.రాష్ట్రం లో ఈ సదుపాయము 1402 ఆసుపత్రుల ద్వారా అందించబడుతుందని,ప్రస్తుతంఈ పధకం లో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని,ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్,పార్కిన్ సన్, వెన్నుపూస కు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు.
వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ లో ఉన్న 98 చికిత్సా విధానాలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు 189.83 కోట్ల ఖర్చు ప్రభుత్వం పై భారం పడనుంది.
65 కొత్త చికిత్సా విధానాలు అంగీకరించడం వల్ల ప్రభుత్వo 158.20 కోట్ల ఖర్చు చేయనుంది.
పై సవరణల వల్ల,మరియు కొత్త చికిత్సా విధానాలు చేర్చడం కోసం,ప్రభుత్వం అదనంగా 497.29 కోట్లు మంజూరు చేశారని బట్టి విక్రమార్క తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !