IFTU జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.
నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 9:
నైనారపు నాగేశ్వరరావు ✍️
మణుగూరు మండల కేంద్రంలో ఈనెల 16న జరిగే మణుగూరు ఏరియా మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ మధుసుదన్ రెడ్డి కార్మికులను కోరారు.
ఆదివారం స్థానిక ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో జరిగిన ఐఎఫ్టియు మణుగూరు ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ,ముందు తరాల కార్మిక వర్గం పోరాడి రక్త తర్పణ చేసి హక్కులు,చట్టాలు సాధిస్తే,ఆ చట్టాలను కార్మిక వర్గానికి వర్తింపజేసి చట్టబద్ధ హక్కులు,సౌకర్యాలు కల్పించవల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి కార్మికుల శ్రమను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికులకు ఏ విధమైన హక్కులు లేకుండా కట్టు బానిసలుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,తమ హక్కుల పరిరక్షణ కోసం, మెరుగైన జీవనం కోసం కార్మిక వర్గం పోరాడవల్సిన అవసరం ఉందన్నారు.బలమైన కార్మిక ఉద్యమాల నిర్మాణం కోసం జరుగుతున్న ఐ ఎఫ్ టి యు మహాసభలలో భాగంగా ఈ నెల 16న ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా మహాసభ జరుగుతుందని,ఈ మహాసభలో మణుగూరు ఏరియా కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు బి మల్సూర్, జెల్ల అశోక్,ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు వి జానయ్య,పి సంజీవరెడ్డి,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు,బ్రాంచి కార్యదర్శి పొడుతూరి లక్ష్మీనారాయణ,బ్రాంచ్ నాయకులు పి నరసింహారావు, ఎన్ త్రిమూర్తులు,ఓబీ వర్కర్స్ నాయకులు జే యాకయ్య తదితరులు పాల్గొన్నారు.