– జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల.
నేటి గదర్, జూన్ 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నిర్వహించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని ఆమె తెలిపారు. జిల్లాలోమొత్తం 8875 మందికి గాను 21 పరీక్ష కేంద్రాల్లో 6649 మంది పరీక్షకు హాజరైనారు. 2222 మంది అభ్యర్థులు గైహాజరైనరని హాజరు శాతం 74.95% గా నమోదు అయినదని కలెక్టర్ పేర్కొన్నారు.
Post Views: 119