ఏపీ,తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లోకి ఐదుగురు…
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి జూన్ 9:
నైనారపు నాగేశ్వరరావు ✍️
తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది.తెలంగాణ నుంచి గెలిచిన BJP MPలు కిషన్ రెడ్డి (సికింద్రాబాద్),బండి సంజయ్ (కరీంనగర్)కు అవకాశం దక్కగా ఏపీ నుంచి TDP MPలు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), BJP MP శ్రీనివాస వర్మ(నరసాపురం)లకు చోటు దక్కింది. అటు రాజమండ్రి నుంచి గెలిచిన BJP ఎంపీ పురందీశ్వరిని స్పీకర్ గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.తెలంగాణలో ఈటల రాజేందర్,డీకే అరుణకు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కకపోవడం వలన పార్టీ శ్రేణుల్లో,అభిమానుల్లో కొంత అలజడి రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కకపోవడం దారుణమని బీసీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.నరేంద్ర మోడీ ఈటల రాజేందర్,డీకే అరుణ ను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోకుండా వారికి మొండి చేయ్యే చూపారని బీసీ సామాజిక వర్గం అసహనానికి గురవుతున్నారు.