నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం పట్టణంకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కుటుంబ సభ్యులు అయినా అన్నం హరిత, అన్నం మనీషా వరసకు తల్లి కూతురులు. డబ్బు, ఆస్థి పాస్తులు సరిపడా ఉన్న, గవర్నమెంట్ ఉద్యోగం చేయటమే లక్ష్యం గా పెట్టుకొని అన్నం హరిత గారు, వాళ్ళ బిడ్డ వయస్సు ఉన్న వారితో కలిసి నిన్న జరిగిన గ్రూప్ – 1 ఎగ్జామ్స్ రాసారు.కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించా వచ్చు అనటానికి వీరే ఆదర్శం అనిపిస్తుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా ఇలా తల్లి, కూతుర్లు ఇద్దరు గ్రూప్ – 1 ఎగ్జామ్స్ రాయటం చాలా ఆనందంగా ఉంది అని అన్నం హరిత, మనిషా ఇద్దరు అన్నారు. ఈ సంఘటన తెలుసుకొన్న నేటి గదర్ న్యూస్ ప్రతినిధి ఎగ్జామ్స్ సెంటర్ కు వెళ్లి న్యూస్ క్లిక్ మనిపించారు.
Post Views: 62