నేటి గద్ధర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం పట్టణంలో గల 58వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఇటీవల స్థానిక ప్రజలు మంత్రి తుమ్మలను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి తుమ్మల సమస్యను పరిష్కరించాలని మునిసిపల్ సిబ్బందిని,అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి తుమ్మల ఆదేశానుసారం డివిజన్లో ఉన్న ప్రధాన మురికి కాల్వ సమస్యలు మరియు బ్రిడ్జి కింద పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే ఈ పారిశుద్ధ్య పనులను డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గర ఉండి పర్యవేక్షించారు…… స్పందించిన మంత్రికి డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 37