నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), జూన్ 11.
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ విద్య శాఖ అధికారి పణిని , డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్ లతో కలిసి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో బడిబాట కార్యక్రమం పై సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ పి .శ్రీజ మాట్లాడుతూ విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని,శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అన్నారు. గ్రామాలలో బడి మానేసే విద్యార్థి సంఖ్య తగ్గించాలని బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందని తెలిపారు. ఈ సమావేశం లో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు రాజు, సాంబయ్య, రమాదేవి, మల్లారెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసులు, దివాకర్, సురేందర్, సాంబయ్య, వెంకటేశ్వర్లు, రాజేష్ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు..