నేటి గదర్, జూన్ 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉత్తమమైన విద్యా బోధన జరుగుతుందని భద్రాచలం నియోజకవర్గం మెల డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణం జగదీష్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉత్తమ విద్యా బోధన జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సమ్మయ్య, హెడ్ మాస్టర్ యస్ యన్ వి రాజా శ్రీనివాసరావు, మండల నాయకులు రత్నం రమాకాంత్, పెద్దినేని శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, మామిడి పుల్లారావు, గాడి విజయ్, పుల్లగిరి నాగేంద్ర, గాడి రాజేష్, ఉపాధ్యాయులు రామకృష్ణ, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.









