నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), జూన్ 13:
జాతీయ మానవ హక్కుల పిల్లలు & ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ములుగు జిల్లా కార్యాలయాన్ని సంస్థ జాతీయ అధ్యక్షుడు ఫౌండర్ మహమ్మద్ మొహీనుద్దీన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మొహీనుద్దిన్ మాట్లాడుతూ మానవ హక్కుల వాటి వల్ల జరిగే ప్రయోజనాలు గ్రామ గ్రామాన ప్రతీ మహిళలకు, పిల్లలకు చేరాలని అందుకోసమే జిల్లా కేంద్రం, మండలకేంద్రాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని అన్నారు.సమాజంలో మహిళలకు,పిల్లలకు భద్రత కల్పిస్తూ వారి హక్కులను ఎలా పొందాలనే అనే అంశంపై వారిలో అవగాహన కల్పిస్తూ గ్రామంలో కమిటీలు వేస్తున్నామని అన్నారు. అలాగే ములుగు జిల్లా అధ్యక్షుడిగా దబ్బకట్ల మనోజ్ కుమార్ ను నియమిస్తున్నట్లు చైర్మన్ మొయినుద్దీన్ తెలిపారు. జాతీయ మానవ హక్కుల పిల్లలు & ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మందికి న్యాయం జరిగిందని అలాగే ఎవ్వరికైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మా ఆర్గనైజేషన్ ను సంప్రదించి తగు న్యాయం పొందవచ్చని చైర్మన్ తెలియజేశారు.ఈ ఆర్గనైజేషన్ లో మహిళలు పెద్దఎత్తున సభ్యత్వం పొందడం శుభసూచకమని చైర్మన్ మొహీనుద్ధిన్ అన్నారు.త్వరలోనే అన్ని జిల్లాల్లో మహిళా విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు సంపెట సుధాకర్,మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఫరానా సుల్తానా,ఉపాధ్యక్షుడు కళ్యాణి,సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు మంజుల, మూడు జిల్లాల ఇంచార్జులు గణిపాక కుమార్,ములుగు జిల్లా కార్యదర్శి ఎం.ప్రకాష్, ఉపాధ్యక్షుడు ఓడపల్లి సురేష్,ఆకులపెళ్లి రాజు, వివిధ జిల్లాల,మండలాల అధ్యక్షులు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.