+91 95819 05907

మిస్ ఇండియా టు సివిల్స్ ర్యాంకర్

◆తొలి ప్రయత్నంలోనే విజయం ◆విజయం కోసం 10+8+6 టెక్నీక్ ను ఫాలో అయినా ఐశ్వర్య

నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:

తను ఒకటి అనుకుంటే భగవంతుడు మరోకటి ఇస్తాడని ఊరకనే అనలేదు పెద్దలు . ఇదిగో ఈ అమ్మాయి విషయంలో సరిగ్గా ఇది సరిపోతుంది. గ్లామర్ రంగంలో రాణించాలనుకుంది. అటుగా అడుగులు వేసింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఫైనలిస్టుగా కూడా ఎంపికైంది. కానీ అనూహ్యంగా సివిల్స్ వైపుకు వెళ్లింది. తొలి ప్రయత్నంలో విజయం సాధించి ఔరా అనిపించింది. రాజస్తాన్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారిణి ఐశ్వర్య షియోరాన్ ఇన్ స్పిరేషనల్ స్టోరీ ఇది. తల్లి కోసం ఓ రంగాన్ని ఎంచుకుంటే.. తాను మరో రంగంలో స్థిరపడింది. ఇందులో విశేషమేమిటంటే.. ఆమెకు తెలంగాణతో ఇటీవల అనుబంధం ఏర్పడింది. ఆమె తండ్రి అజయ్ కుమార్ ప్రస్తుతం కరీంనగర్‌లోని 9వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్‌లో కమాండింగ్ ఆఫీసర్.తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతోనే ఆమె కూడా దేశానికి సేవ చేసే సివిల్స్ వైపు అడుగులు పడేలా చేసింది. ఐశ్వర్య తన ప్రాథమిక విద్యాభ్యాసం చాణ్యకపురిలోని సంస్కృతి పాఠశాలలో పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ కోసం ఢిల్లీకి వెళ్లింది. 12వ తరగతిలో 97. 50 % శాతం మార్కులు తెచ్చుకుంది. అనంతరం ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అప్పుడే అందాల పోటీల్లో పాల్లొంది. 2014లో మిస్‌ క్లీన్‌ అండ్‌ కేర్‌ ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌తో పాటు ,2015లో మిస్ ఢిల్లీ కిరీటాన్ని కైవంసం చేసుకుంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలకు వెళ్లింది. 2016లో జరిగిన పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచింది. అమ్మ కల తీర్చేందుకు ఈ రంగంలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య. ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి.
దీని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెట్టింది. 2018లో IIM ఇండోర్‌లో సీటు వచ్చింది.కానీ చేరలేదు. మోడలింగ్ రంగం నుండి ప్రజలకు సేవ చేయాలని తలచింది. సివిల్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యింది. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా అన్ని ప్రిపేర్ చేసుకునేది. అలా తొలి ప్రయత్నంలోనే UPSCలో 93వ ర్యాంక్‌ను సాధించింది. 10 నెలల పాటు కఠోర దీక్ష చేసినట్లే చదివింది. ఆమె కృషికి తగ్గ ప్రతి ఫలం లభించింది. సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం 10+8+6 టెక్నిక్‌ ఫాలో అయ్యానని చెబుతుంది ఐశ్వర్య. అంటే పదిగంటలు చదువు, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర పనులు చక్కబెట్టేదానన్ని చెబుతుంది. IFS అధికారిగా ఎంపికైన ఈ అమ్మాయి.ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. సాధించాలన్న తపన ఉండాలే కానీ.ఎంతటి కఠోర పరీక్షల్లో అయినా రాణించొచ్చు అని నిరూపించింది ఐశ్వర్య.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !