అధికారులతో రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 13:
నైనారపు నాగేశ్వరరావు✍️
మణుగూరు మండల కేంద్రం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మణుగూరు మున్సిపాలిటీ అధికారులతో మణుగూరు మున్సిపాలిటీలోని వివిధ రకాల అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మున్సిపాలిటీలో నివసించే గ్రామస్తులకు కొత్తగా నివసించే కుటుంబాలకు ఇంటి పన్ను లేనివారికి ఇంటి పన్ను ఇవ్వాలని ఆయన అన్నారు.
పెండింగ్ లో ఉన్న డ్రైనేజీలను పూర్తి చేయాలని,గ్రామాలకు త్రాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని,సిసి రోడ్లు ప్రతి గ్రామానికి ఏర్పాటు చేయాలని, సిబ్బంది,అధికారులు,మున్సిపాలిటీలోని ప్రతి గ్రామానికి,వార్డుకు పాదయాత్ర చేసి ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా సాగేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
ఆయా సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తీసుకోని వెంటనే పనులను పూర్తి చేయాలని ప్రజల సమస్యలను చర్చించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించిశారు.