★కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్
నేటి గదర్ న్యూస్,వైరా: సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందించడమే CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యం అని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. మండలంలోని ముసలమడుగు గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం ఆయన చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు ,MPTC శీలం వెంకటరామిరెడ్డి ,కాంగ్రెస్ నాయకులు , గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహారావు, ఎక్స్ ఎంపీటీసీ తడకమళ్ళ నాగేశ్వరరావు నాయకులు నరవనేని బుజ్జి ,అభిమానులు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 104