+91 95819 05907

ట”మాట” ల్లేవ్.. సామాన్యుడికి కూర “గాయలు”

నేటి గదర్, జూన్ 19 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాట ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి. ప్రతి కూరలోనూ తప్పని సరిగా ఉపయోగించే టమాట ఇప్పుడు భారంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న టమాట ధరలు ఇటు ప్రజలతోపాటు అటు రీటైల్‌ మార్కెట్‌ను వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా కూర”గాయల” ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కిలో టమాట రూ.100 పలుకుతోంది.
కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టు కుందామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూరలాంటి ఆకుకూరలు గతంలో రూ.10కి 5 కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు రూ.20కి 3 లేదా 4, 5 చొప్పున అమ్ముతున్నారు.
మరోవైపు మిర్చి ధర కూడా కిలో రూ.100 దాటింది. ఉల్లి కూడా ఘాటెక్కింది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూర “గాయ”ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో చాలా వరకు గ్రామల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది. స్థానికంగా టమాటలు దొరక్కపోవడంతో టమాట ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం, పది రోజుల్లో టమాట ధరలు రూ.200 వరకు చేరే అవకాశం ఉంది. టమాటనే కిలో రూ.100 ఉంటే మిగిలిన కూరగాయలు ఎలా కొనాలని సామాన్యులు వాపోతు న్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !