+91 95819 05907

గ్రామపంచాయతీ కార్మికులపై అధికారుల వేధింపులు, బెదిరింపులు ఆపాలి :IFTU

★ఎనిమిది గంటల పని విధానం అమలు జరపాలి

★సకాలంలో జీతాలు ఇవ్వకుండా పనిచేపించుకోవడం దుర్మార్గం

★గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలి

★ప్రతీ ఆదివారం, ప్రభుత్వ ప్రకటించే పండగ సెలవులను వర్తింపజేయాలి

★ప్రతి నెల నిర్దిష్ట తేదీన జీతాలు వేయాలి

★గ్రామపంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి

★మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి

★అక్రమ తొలగింపులు అరికట్టాలి

★IFTU భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి/చర్ల:

చర్ల మండలంలో IFTU కార్మిక సంఘం ఆధ్వర్యంలో పలు గ్రామపంచాయతీలోని గ్రామ పంచాయితీ కార్మికులను కలవడం జరిగింది. దీనిలో భాగంగానే తేగడ గ్రామపంచాయతీ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు కార్మిక సంఘం భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ చర్ల మండలంలో అనేక పంచాయతీలోని కార్మికులకు నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. జీతాలు ఇవ్వకుండా పనిచేయించుకోవడం సరైన పద్ధతి కాదు అని అన్నారు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కాలకు జీతాలను వెంటనే ఇవ్వాలని, కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాదాలు జరిగినప్పుడు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని జీవిత బీమా సౌకర్యం కల్పించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ప్రతినెల నిర్దిష్ట సమయంలో జీతాలు అకౌంట్లోకి వేయాలని, హెల్త్ కార్డులు, యూనిఫామ్ లు ,రక్షణ పరికరాలు ఇవ్వాలని ,కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశాడు. లేనియెడల కార్మికులందరినీ IFTU ఆధ్వర్యంలో ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తేగడ కార్మికులు రత్నకుమారి, జగదీష్ ,ప్రభాకర్, త్రిమూర్తులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 19

Read More »

 Don't Miss this News !