★డి.వై.యఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట. రమేష్ పిలుపు.
★డ్రక్స్ మాఫీయపై నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు.-డి.వై.యఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్.బసీరుద్దీన్ వెల్లడి.
★డి.వై.యఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో పలు అంశాలపై కార్యాచరణ.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
ఖమ్మం(జూన్ 21,2024): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువజనుల సమస్యలపై డి.వై.యఫ్.ఐ ఆధ్వర్యంలో గ్రామాలలో,పట్టణాలలో,బస్తీలో సర్వే నిర్వహిస్తున్నట్లు,సర్వేలలో యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట. రమేష్ యువతకు పిలుపునిచ్చారు.
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య(డివైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు మద్దాల.ప్రభాకర్ అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో యువతి,యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై డి.వై.యఫ్.ఐ కార్యకర్తలు అధ్యయనం చేసి సర్వే నిర్వహించి,సర్వేలలో వచ్చిన సమస్యలపై పోరాటల రూపకల్పన చేసేందుకు రాష్ట్ర కమిటీ కార్యాచరణ తీసుకుందని ఆయన తెలిపారు.అలాగే నీట్ పరీక్ష రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని ఆయన అన్నారు.దేశ భవిష్యత్తుతో మోడీ చలగాటమాలడం సరికాదన్నారు దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే విద్యార్థుల పరీక్షలలో పద్ధతులు వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు బిజెపి అధికారంలో ఉన్నంటి రాష్ట్రాల్లోనే ఎందుకు పేపర్ లీకేజీలు అవుతాయని ఆయన ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా పరీక్ష కన్నా ముందే పేపర్ల లీకేజ్ అవుతుంటే ఆట బొమ్మలాడుతున్నట్లుగా వ్యవహరించే తీరు సరైన పద్ధతి కాదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.సర్వేలలో యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. అనంతరం డి.వై.యఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్.బసీరుద్దీన్ మాట్లాడుతూ డ్రక్స్ మాఫీయపై,నిర్మూలనకై విద్యార్దులను, యువకులను చైతన్య వంతం చేస్తూ జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్, సత్తెనపల్లి నరేష్ ,పటాన్ రోషినికాన్ , శీలం వీరబాబు,కూరపాటి శ్రీను, గుమ్మ ముత్తారావు, బొడ్డు మధు, షేక్ నాగురు పాషా, చిత్తార్ మురళి, రావులపాటి నాగరాజు, శభాష్ రెడ్డి సాయి రాకేష్, ఎర్ర సాయి, ఎర్ర నగేష్, తాటి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.