+91 95819 05907

సింగరేణి బంద్‌ అయితే చాలా మందికి ఉద్యోగాలు పోతయ్: డిప్యూటీ సీఎం భట్టి

★ సింగరేణి బొగ్గు బావుల వేలం నిలుపుదల చెయ్యాలి

★ తెలంగాణ చెందిన వ్యక్తి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు
★ బొగ్గు గనులు వేలానికి రాకుండా PM ని ఒప్పించాలి

★మంత్రి తుమ్మల

నేటి గదర్ న్యూస్,ఖమ్మం:

సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని, సింగరేణి తెలంగాణకే తలమానికమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిలో 42 వేల మంది రెగ్యులర్‌, 22 వేలమంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని, ప్రస్తుతం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోందని వివరించారు. ఖమ్మం జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన భట్టి సింగరేణి బొగ్గు గనుల వేలంపై మాట్లాడారు.
2030 కల్లా 15 మిలియన్‌ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుందని, గనుల చట్టానికి కేంద్రం సవరణలు తీసుకొచ్చి ఆమోదించుకుందని మంత్రి భట్టి పేర్కొన్నారు. బొగ్గు గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనేలా చట్టం చేశారని, ప్రభుత్వ రంగ సంస్థలకు దేశంలోని బొగ్గు గనులను కేటాయించలేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన గనుల సవరణ చట్టానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించిందని మంత్రి భట్టి పేర్కొన్నారు. గోదావరి పరిసరాల్లో ఉన్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనకూడదని కేసీఆర్‌ ఆదేశించారని, కేసీఆర్‌ సన్నిహితులకు బొగ్గు గనులు వెళ్లేలా కుట్ర చేశారనిఆయన ఆరోపించారు. కేసీఆర్‌ తన సన్నిహితుల కోసం సింగరేణిని బొంద పెట్టారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం జరిగితే పాల్గొనకుండా, ఒడిశాలో జరిగిన వేలంలో పాల్గొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యక్తే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారని, సింగరేణిని కాపాడాలని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి ఆస్తులను, వ్యవస్థను కాపాడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సింగరేణి బంద్‌ అయితే చాలా మందికి ఉద్యోగాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ సహకరించాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 3

Read More »

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

 Don't Miss this News !