★ మంత్రి పొంగులేటిని చూసి పరిగెత్తుకుని వచ్చిన మహిళా కూలీలు
★ వారితో ఆప్యాయంగా మాట్లాడిన పొంగులేటి
★ త్వరలోనే మహిళలకు రూ. 2500 పథకం అమలు చేస్తాం
★మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేటి గదర్ ,జూన్ 23 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
అభిమానం ఆయన సొంతం..ప్రేమగా పలకరిస్తాడు ..ఆప్యాయతగా దగ్గరకు తీసుకుంటాడు… నిస్వార్థమైన రాజకీయ ప్రజల నాయకుడు … ఆయనను చూస్తే చిన్న పిల్లలు నుండి పండు ముసలి వరకు ఎనలేని అభిమానం చూపిస్తారు. ఆయన కూడా జనాన్ని చూస్తే చాలు ఆప్యాయత దగ్గరకు తీసుకొని ప్రేమ చూపిస్తాడు.. ఆయనే తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. శనివారం పాలేరు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పర్యటన సమయంలో తిరుమలాయపాలెం మండలం లక్ష్మీదేవిపల్లితండ నుండి పొంగులేటి కాన్వాయ్ వెళ్తుండగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ చూసిన మహిళలు ఆయనను కలిసేందుకు మహిళా కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చారు . వారిని చూసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కారు దిగి మహిళ కూలీల దగ్గరకే వెళ్లి ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నాడు. రాబోయే రోజుల్లో మహిళలు 2500 రూపాయల పథకం కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు..