నేటి గద్దర్ న్యూస్, బోనకల్/ మధిర:మధిర మున్సిపాలిటీలో పలు వార్డులలో పారిశుధ్యం పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 14వ వార్డులో పారిశుద్ధ్య పనులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో
చెత్తను తొలగించుకున్నట్లు వార్డు ప్రజలు తెలిపారు.
గత కొన్ని రోజులుగా వీధులలో ఉన్న రహదారులపై చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
15 రోజులకు పైగా చెత్త ట్రాక్టర్ రావడంలేదని గృహవాసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గంధం భరించలేక చెత్తాచెదారాన్ని తామే తొలిగించుకుంటున్నామంటున్న గృహవాసులు.రాజకీయ పక్షాలు కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉంటున్నాయంటున్న మున్సిపల్ ప్రజలు.ప్రతిరోజు ఏ వార్డులో చూసిన ఇదే తంతుగా పారిశుధ్యం పై ఆరోపణలు.మధిర పట్నంలో పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించకపోతే పట్టణవాసుల ఆగ్రహానికి గురికాక తప్పదు మున్సిపాలిటీ ప్రజలు హెచ్చరించారు.