నేటి గద్దర్ న్యూస్, బోనకల్:
మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని బహుజన సమాజ్ పార్టీ మధిర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంధం వంశీ జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు. గతంలో గార్లపాడు మీదుగా బోనకల్ వరకు బస్సు సౌకర్యం ఉండేదన్నారు. గార్లపాడుకు గత సంవత్సరం నుంచి ఆర్టీసీ బస్ సౌకర్యం నిలిపివేశారని వినతిలో పేర్కొన్నారు.
Post Views: 30