★ సీఎం పిఎఫ్ బ్యాలెన్స్ చెట్టీలు అందించాలి.
★ ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి/మణుగూరు:
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సీఎం పిఎఫ్ లెక్కలు వెంటనే తేల్చి, సీఎం పీఎఫ్ బ్యాలెన్స్ చిట్టీలు అందించాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. మంగళవారం సింగరేణిలోని వివిధ విభాగాల కాంట్రాక్టు కార్మికుల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా సీఎం పిఎఫ్ లెక్కలు గత మూడు సంవత్సరాల నుండి తేల్చడం లేదని, సీఎం పిఎఫ్ చిట్టిలు ఇవ్వడం లేదని, అదేవిధంగా కే సి హెచ్ పి లో బెల్ట్ క్లీనింగ్ కార్మికులు గా గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించకుండా ఆన్ స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తున్నారని, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని కార్మికులు వారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైన చెప్పిన విషయాలు కార్మికులు తన దృష్టికి తీసుకువచ్చారని, పై సమస్యలను స్థానిక సింగరేణి అధికారుల దృష్టికి తీసుకుపోగా పర్మినెంట్ కార్మికుల సిఎంపిఎఫ్ లెక్కలు చూస్తున్నామని, ఆన్లైన్ చేస్తున్నామని, ఈ నెలాఖరు వరకు పర్మినెంట్ కార్మికుల సీఎం పి ఎఫ్ లెక్కలు, ఆన్లైన్ పని పూర్తయిన తర్వాత వచ్చే నెల నుండి కాంట్రాక్ట్ కార్మికుల సీఎం పిఎఫ్ లెక్కలు, ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారని, ప్రైవేట్ గార్డుల డిస్ట్రిబ్యూషన్ సమస్యలను కూడా వారితో మాట్లాడి పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు తెలిపారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సీఎం పిఎఫ్ లెక్కలు, సీఎం పీఎఫ్ లెక్కల చిట్టీలు త్వరగా అందించడానికి కృషి చేయాలని, కే సి హెచ్ పి బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమీస్కిల్డ్ వేతనాలు చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.
ఈ సమావేశంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు వి. జానయ్య, పి. సంజీవరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.