◆కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, జూన్ 25:
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో ఢిల్లీలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్టం లో 6,176 గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని కేంద్ర మంత్రికి ఆమె నివేదించినట్లు తెలిపారు.తెలంగాణలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు తక్షణమే మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.
తాత్కాలిక భవనాల్లో గ్రామపంచాయతీల సిబ్బంది తమ విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నాయని కేంద్ర మంత్రి దృష్టి కి తీసుకవెళ్లారు.