నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
✍️ సతీష్ కుమార్ జినుగు
మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు.
జూన్ 26 న మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు పట్టణాలు, మండలాలలోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు విస్తృత స్ధాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాలలో ప్రజలు, యువకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు