నేటి గదర్ ,జూన్ 26 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
నేలకొండపల్లి మండలం కేంద్రంలో స్వాతంత్ర్య సమర యోధులు, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కోత్తా జనార్దన్ రావు దశ దిన కర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. అనంతరం వాసవి భవన్ ఫంక్షన్ హాల్ నందు నేలకొండపల్లి మండల,పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, తన తుదిశ్వాస విడిచే వరకూ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పని చేస్తూ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ప్రజలతో ఆయన కలిసిమెలిసి జీవించేవారని అన్నారు.. నిస్వార్ధంగా కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా తను చేసిన కార్యక్రమాలు ఎన్నటికీ మర్చిపోలేము అని వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు..