+91 95819 05907

ప్రకృతి ఒడిలో సేవలందించడం అదృష్టంగా భావిస్తున్న : జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

స్వచ్ఛమైన గిరిజన ప్రాంతంలో సేవలందించడం అదృష్టం

• జిల్లా కలెక్టర్కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు

• పక్కా వ్యూహంతో ఎన్నికలు విజయవంతం

• అందరి సహాకారం తో విధులు

జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

నేటి గద్దర్ పాడేరు న్యూస్

అల్లూరి జిల్లా పాడేరు జూన్ 26 స్వచ్ఛమైన గిరిజన ప్రాంతం అందమైన ప్రకృతి ఒడిలో సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ట్ అధ్యక్షతన బదిలీపై వెళుతున్న జిల్లా కలెక్టర్ను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విజయం ప్రజాస్వామ్య విజయమని, ఎన్నికల సంఘం విజయమని పేర్కొన్నారు. అందరి సహకారంతో పక్కా వ్యూహంతో ఎన్నికల విధులను విజయ వంతంగా నిర్వహించామని చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా సువిశాలమైనదని అమ్మవారి ఆశీస్సులతో సేవలందించానని అన్నారు. నాలుగు నెలలు అధికారులతో పని చేసానని, ప్రజలకు సేవలందించ లేకపోయానన్నారు. పొలిటికల్ పార్టీలు, పాత్రికేయులు చక్కని సహకారం అందించారని అన్నారు. ఎన్నికల నేపధ్యంలో సామాజిక పింఛన్లు, వైద్యపరమైన సేవలలో జిల్లాను అగ్రస్థానంలో నిలపామన్నారు. నాలుగు నెలలు నాలుగు వారాలుగా గడిచిపోయాయని చెప్పారు. జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు ఎన్నికల సమయంలో చక్కని సహకారం అందించారని పేర్కొన్నారు.
అమ్మవారి జాతరను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయ వంతంగా నిర్వహించగలిగానన్నారు.

జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ట మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా ఎన్నికలు నిర్వహణలో జిల్లా కలెక్టర్ అండగా నిలిచి నిరంతరం సహకారం అందించారని చెప్పారు. ఎప్పటికప్పుడు సూచనలు చేసేవారని చెప్పారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిందన్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం

రంపచోడవరం ఐటిడి ఏ పి ఓ సూరజ్ గనోరే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాయకత్వంలో ఎన్నికలను విజవంతం చేసామన్నారు. రంపచోడవం సబ్ కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ నిరంతరం సలహాలు సూచనలు ఇస్తూ కలెక్టర్ అందించిన సహకారంతో ఎన్నికలను విజయవంతం చేసామన్నారు. పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ బౌగోళికంగా అతిపెద్ద జిల్లా, సెక్యూరిటీ సమస్యలున్నప్పటికి సార్వత్రిక ఎన్నికలను, మోదకొండమ్మ అమ్మవారి జాతరను విజయవంతం చేసారన్నారు.

ఈ కార్యక్రమంలో చింతూరు ఆర్ డి ఓ చైతన్య, ఎస్పీ ధీరజ్, డి. ఆర్. ఓ బి. పద్మావతి, ఎస్ డిసిలు వి.వి. ఎస్. శర్మ, భవాని, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ డి.వి. ఆర్. ఎం. రాజు, డి. ఆర్. డి. ఏ .పి.డి. మురళి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ భాషా, జిల్లా వ్యవసాయాధికారి నంద్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకలు ఐ. కొండలరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. తదితరులు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !