★ నిండుతున్న ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్డు డ్రైనేజీ
★ పొంచి ఉన్న ప్రమాదం
★ గ్రీడ్ లైన్ పరిశీలన చేస్తాం:
భగీరథ గ్రిడ్ లైన్ AE వీరబాబు
నేటి గదర్ న్యూస్,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద మిషన్ భగీరథ మెయిన్ గ్రిడ్ లైన్ కి చిన్నపాటి రంద్రం పడిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. మణుగూరు, ఏటూరు నాగారం ప్రధాన రహదారి ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద పంచాయతీ అధికారులు డ్రైనేజీ మరమ్మత్తు పనులు గత కొద్ది రోజుల నుండి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డ్రైనేజీ పక్కనే ఉన్న మిషన్ భగీరథ ప్రధాన గ్రిడ్ లైన్ కు సంబంధించిన భారీ పైపులకు రంద్రం పడిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరో హోండా షోరూం సమీపంలోని డ్రైనేజీలోకి సురక్షితమైన నీరు చేరుతుండడంతో అది భగీరథ వాటరా అని సందేహం వ్యక్తం అవుతుంది.
గ్రిడ్ లైన్ పరిశీలన చేస్తాం:
డ్రైనేజీలోకి వాటర్ చేరుతుండడంతో నేటి గదర్ గురువారం ఉదయం పరిశీలనకు వెళ్ళింది. డ్రైనేజీని లోతుగా తీయడంతో సురక్షితమైన వాటర్ దానిలోకి చేరింది. అనుమానంతో తొలుత మిషన్ భగీరథ ఏఈ విజయకృష్ణను సంప్రదించగా… భగీరథ పైప్ లైన్ కాదని సమాధానమిచ్చారు. అనంతరం మిషన్ భగీరథ గ్రిడ్ లైన్ AE వీరబాబుని వివరణ కోరగా తమ సిబ్బందిని పంపించి పరిశీలన చేస్తామన్నారు.
కొందరి వ్యక్తులు గ్రిడ్లైన్ కి హోల్ పెట్టడంతో వాటర్ వృధాగా పోతుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. భగీరథ గ్రిడ్ పైపుకు మరమ్మత్తులు నిర్వహించకుంటే భారీగా నీరు ప్రధాన రహదారిపై చేరే ఆస్కారం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తక్షణమే సమస్యను పరిష్కరించాలి.