సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్
– ఎగసిపడిన గోదావరి జలాలు
– పులకించిన మంత్రి తుమ్మల
– త్వరలో గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు
-నేడు మంత్రుల బృందం పర్యటన
నేటి గదర్, జూన్ 27,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలను ప్రజల చెంతకు చేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న సీతారామ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యి ప్రజలకు గోదావరి జలాలను అందించేందుకు సంసిద్ధమవుతుంది. గురువారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో అధికారులు నిర్వహించిన సీతారామ ప్రాజెక్టు కొత్తూరు పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల భూమాతకు, తల్లి గోదావరి కి వందనం చేశారు. ప్రజలకు నీటి కష్టాలు తీర్చి సమీపంలో ఉన్న గోదావరి జలాలను ప్రజల చెంతకు చేర్చాలని తన చిరకాల స్వప్నం అతి త్వరలో నెరవేరబోతుందని మంత్రి తుమ్మల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం సమయానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు సీతారామ ప్రాజెక్టు, పంప్ హౌస్ ఏర్పాట్లను పరిశీలించనన్నారు.