+91 95819 05907

పదేళ్లు పాలించినోళ్లు 7లక్షల కోట్లు అప్పుచేసి పారిపోయారు

పదేళ్లు పాలించినోళ్లు 7లక్షల కోట్లు అప్పుచేసి పారిపోయారు
– ఇందిరమ్మ ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం
– 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం 
– విధివిధానాల రూపొందించి, చట్టం చేశాక రైతు భరోసా అమలు చేస్తాం 
– గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారు.
– రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు. అయినా ఇంటింటికి తాగు నీటిని ఇవ్వలేకపోయారు
– రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటాం
– రామగుండం లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం
– త్వరలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందిస్తాం 
– కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు, స్థానికంగా ఐటీ హబ్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తాం

నేటి గదర్, జూన్ 27,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :

గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఖజానాను దోపిడీ చేసి, ఎవరికి పడితే వారికి పంచారని, 7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. గురువారం కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వదు ఇవ్వదు అని ప్రచారం చేశారని, మేము ఒకేసారి 7,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని, ఇప్పుడు రైతుకు రుణమాఫీ చేయరు.. చేయరు ..అని ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని చేసి చూపిస్తామని అన్నారు. ఎన్ని రకాల ఆటంకాలు ఉన్న.. రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి వెల్లడించారు. ఆగస్టు కాదు అంతకన్నా ముందే రుణమాఫీ చేసి చూపిస్తామని వెల్లడించారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరని, ఆయన అన్నారు. ఇక రైతు భరోసా విషయానికొస్తే ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి అన్నది ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చకు పెట్టి చట్టం చేసి కచ్చితంగా రైతు భరోసా ఈ రాష్ట్ర రైతులకు అందజేస్తామన్నారు. ప్రజల సొమ్ము నిరుపయోగం కాకుండా, ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మాత్రం రూపాయి రూపాయి పోగు చేసి అర్థవంతంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తుందన్నారు. సంపదను సృష్టిస్తాం.. ఆ సంపదను రాష్ట్ర ప్రజలకు పంచుతామని ధీమా వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి గత పది ఏళ్ళు పాలించిన వారు 42 వేల కోట్లు అప్పు తెచ్చారు, అయినా ఇంటింటికి తాగునీరు రాని దుస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కొత్తగూడెం పట్టణంలో తాగునీటి సరఫరాకు 150 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చిందని, నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి 150 కోట్లతో తాగునీరు అందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవకాశం ఉంటే తప్పకుండా మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం పట్టణానికి ఒకటే దారి ఉంది. ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బందులు ఏర్పడతాయని, ఈ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి గాను స్థల సేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. ఆర్ఓబి నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్వో బీల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కావలసినంత స్థలం, నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నందున రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, త్వరలోనే శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం తెలిపారు. కొత్తగూడెంలో ఐటీ హబ్ నిర్మాణానికి కావలసిన స్థలం ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తానని, టైర్ టు సిటీ, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం అభివృద్ధికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ఐటి హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 
  గత పాలకులు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 9000 కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలన్నిటిని తప్పించుకున్నామని, ఆరు నెలల్లో పూర్తి చేయగలిగేవి ఏంటి, ఏడాదిలో, మూడు సంవత్సరాల కాలంలో, ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్న అన్ని ప్రాజెక్టులను గుర్తించామని తెలిపారు. వీటినీ ప్రాధాన్యత క్రమం లో పూర్తి చేసి సాగునీరు అందిస్తాం, త్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని పారిస్తామన్నారు. 70 కోట్లతో వైరా ప్రాజెక్టుకు లింకు కెనాల్ ను అనుసంధానం చేస్తున్నట్టు వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !