★సీతారామ ప్రాజెక్టు కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో ప్రజలకు చెప్పాలి
★రెండు నెలలు గా ఆసరా పింఛను కు దిక్కు లేదు
★సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరందించాలి
★ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా కు ఒరిగింది ఎం లేదు.
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఫైర్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
సీతారామ ప్రాజెక్టును అడ్డుకోవాలని కుటిల బుద్ధితో కాంగ్రెస్ కార్యకర్త తెల్లం నరేష్ తో కోర్టులో కేసు వేయించింది ఎవరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. మందికి పుట్టిన పిల్లలు నా పిల్లలే అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ మంత్రుల పరిస్థితిని ఎద్దేవ చేశారు. సీతారామ ప్రాజెక్ట్ స్విచ్ ఆన్ చేసే ముందు ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్. సీతారామ ప్రాజెక్టు ఆగిపోయి సంవత్సరం దాటిన దిక్కుమక్కు లేదని, కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ వారితో జిల్లాకు ఒరిగింది శూన్యం అని ఎద్దేవచేశారు. రెండు నెలలు అవుతున్న ఆసరా పింఛన్లు ఎందుకు వేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రానున్న రోజులలో ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.