★కొనసాగుతున్న చేపల పెంపకంపై శిక్షణ.
★అధునాతన సాంకేతికతను వినియోగించుకుంటే ఎన్నో లాభాలు..
నేటి గదర్ ,జూన్ 27 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
మత్స్య పరిశోధన స్థానం పాలేరు గ్రామంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో 5రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు కూసుమంచి ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మత్స్య పరిశోధనలో షెడ్యూల్ కులాల వారికి కల్పిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీనియర్ శాస్త్రవేత్త శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో” రీ సర్కులేటరీ ఆక్వాకల్చర్ సిస్టం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం” అనే అంశంపై సూర్యాపేటకు చెందిన 25 మంది రైతులకు వివరించారు. శాస్త్రవేత్తలు జి గణేష్ , బి రవీందర్ రీసెర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టం యొక్క భవిష్యత్తు ప్రాముఖ్యత లాభనష్టాలు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు.