★గత ప్రభుత్వ హామీలను అమలు చేస్తాం…
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
★పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కుటుంబానికి భరోసా… పొంగులేటి
నేటి గధర్ న్యూస్ (స్టేట్ బ్యూరో) జూన్ 27:
నైనారపు నాగేశ్వరరావు✍️
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పర్యటనలో భాగంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాతృమూర్తి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన విషయం విధితమే.అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య అనారోగ్యం మరణించిన్నారు.ఇరువురి కుటుంబాలను రెవిన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాతృమూర్తి రాములమ్మ, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ,గత ప్రభుత్వం రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని వారికి హామీ ఇచ్చారు.పద్మశ్రీ అవార్డు గ్రహీత కు గత ప్రభుత్వ జీవో ప్రకారం కోటి రూపాయలు మరియు జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం,ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం,రామచంద్రయ్య సతీమణికి కళాకారుల సంక్షేమ నిధి నుండి ప్రతినెల పదివేల రూపాయలు పింఛన్ ఇప్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రామచంద్రయ్య కుటుంబ సభ్యులకి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య,అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,టిపిసిసి ఉపాధ్యక్షులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య,ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.